ఒమానీ కార్మిక మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ

- September 14, 2022 , by Maagulf
ఒమానీ కార్మిక మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ

మస్కట్: ఒమానీ కార్మిక మంత్రి డాక్టర్ మహద్ బిన్ సైద్ బిన్ అలీ బావోయిన్‌ను మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో బహ్రెయిన్ రాయబారి డాక్టర్ జుమా బిన్ అహ్మద్ అల్ కాబీ కలిశారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-ఒమన్ జాయింట్ కమిటీ సిఫార్సుల అమలు, ఒమన్ సుల్తానేట్‌లో పనిచేస్తున్న బహ్రెయిన్ చిన్న, మధ్యతరహా సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన అనేక సమస్యలపై చర్చించారు. బహ్రెయిన్-ఒమన్ జాయింట్ కమిటీ సిఫార్సుల అములపై తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య దృఢమైన సోదర సంబంధాలను ఈ సందర్భంగా ఒమనీ మంత్రి ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com