న్యూఢిల్లీలో G-20 సమ్మిట్. యూఏఈని ఆహ్వానించిన ఇండియా
- September 14, 2022
యూఏఈ: వచ్చే ఏడాది సెప్టెంబర్ 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశానికి యూఏఈని అతిథి హోదాలో ఆహ్వానిస్తున్నట్లు గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G-20) ఇన్కమింగ్ ప్రెసిడెంట్ ఇండియా ప్రకటించింది. G-20 అధ్యక్ష పదవిని ఇండియా 2022 డిసెంబర్ 1న అధికారికంగా చేపట్టనుంది. వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు ఇండియా ఈ పదవిలో కొనసాగుతుంది. యూఏఈతోపాటు బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, న్యూ ఢిల్లీ సమ్మిట్‌కు అతిథి దేశాలుగా ఆహ్వానిస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. వీటితోపాటు అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిర్వాహణ, మౌలిక సదుపాయాల కూటమి, ఆసియా అభివృద్ధి బ్యాంకులను కూడా భారత్ ఆహ్వానిస్తుంది. అలాగే ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఆఫ్రికన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ అసోసియేషన్ సంస్థల అధ్యక్షులు/చైర్మన్లు సమ్మిట్ లో పాల్గొంటారని ఇండియా ప్రకటించింది.
ప్రపంచ GDPలో 85 శాతం
G-20లో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ (EU) కూడా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, అమెరికాలు G-20లో సభ్య దేశాలుగా ఉన్నాయి. G-20 కూటమి ప్రపంచ GDPలో 85 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉంది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!