సౌదీలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు...146 మంది డ్రగ్స్ స్మగ్లర్లు అరెస్ట్
- September 14, 2022
రియాద్: సౌదీలో భారీ డ్రగ్స్ ముఠాను భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 48.6 టన్నులకు పైగా ఖాట్, 1.5 టన్నుల హాషిష్, 634,000 యాంఫెటమైన్ మాత్రలను అక్రమంగా రాజ్యంలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని భద్రతాధికారులు అడ్డుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 19 మంది పౌరులతో సహా 146 మంది స్మగ్లర్లను సౌదీ భద్రతా అధికారులు అరెస్టు చేశారు. అనుమానితుల్లో 87 మంది యెమెన్ పౌరులు, 32 మంది ఇథియోపియన్లు, ముగ్గురు సోమాలి జాతీయులు, ఇద్దరు ఇరాకీలు, ఇద్దరు ఈజిప్షియన్లు, ఒక పాకిస్థానీ ఉన్నారని అధికారులు తెలిపారు. నజ్రాన్, జజాన్, అసిర్, తబుక్ ప్రాంతాల భద్రతా సరిహద్దుల గార్డులు నిర్వహించిన ఈ ఆపరేషన్ వీడియోను సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









