అల్ ఫతే హైవే పూర్తిగా మూసివేత

- September 14, 2022 , by Maagulf
అల్ ఫతే హైవే పూర్తిగా మూసివేత

మనామా: అల్ ఫతేహ్ హైవే డెవలప్ మెంట్ పనుల కారణంగా సౌత్‌బౌండ్ ట్రాఫిక్ కోసం హైవేని పూర్తిగా మూసివేయనున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ తెలిపింది. ఈ సమయంలో  ట్రాఫిక్ ను ఎగ్జిబిషన్స్ అవెన్యూకి మళ్లించనున్నట్లు పేర్కొంది. వాహన దారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని వర్క్స్ మినిస్ట్రీ సూచించింది. అల్ ఫతేహ్ హైవే మూసివేత ఉత్తర్వులు గురువారం నుండి ఆదివారం వరకు తెల్లవారుజాము ఒంటిగంట నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయని వర్క్స్ మినిస్ట్రీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com