ప్రమోషన్ల కోసం జాతీయ జెండా, చిహ్నాన్ని వాడటాన్ని నిషేధించిన సౌదీ

- September 17, 2022 , by Maagulf
ప్రమోషన్ల కోసం జాతీయ జెండా, చిహ్నాన్ని వాడటాన్ని నిషేధించిన సౌదీ

సౌదీ అరేబియా: జాతీయ జెండా గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా, ఎవ్వరూ దాన్ని మిస్ యూజ్ చేయకుండా ఉండేందుకు సౌదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి తమ వస్తువులు, ఇతరత్రా కార్యక్రమాల ప్రమోషన్లకు జాతీయ జెండాను, జాతీయ చిహ్నాన్ని వాడటాన్ని బ్యాన్ చేసింది. వచ్చే శుక్రవారం సౌదీ జాతీయ దినోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఇప్పటికే చాలా సంస్థలు, హోటళ్లు, ఇతర బ్రాండ్స్ తమ వస్తువుల ప్రమోషన్ కోసం జాతీయ జెండాను వాడుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని ఎవరైనా తమ ప్రచారం కోసం జాతీయ జెండాను వాడుకుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com