తోటి స్టూడెంట్ పై దాడి చేసిన ఘటనలో విచారణ ప్రారంభం

- September 17, 2022 , by Maagulf
తోటి స్టూడెంట్ పై దాడి చేసిన ఘటనలో విచారణ ప్రారంభం

బహ్రెయిన్: బహ్రెయిన్ లోని ఓ ప్రైమరీ స్కూల్ లో తోటి విద్యార్థి పై కొంతమంది విద్యార్థులు గ్రూప్ గా మారి దాడి చేశారు. దీంతో దాడికి గురైన పిల్లాడి తల్లితండ్రులు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై బహ్రెయిన్ విద్యాశాఖ విచారణ చేపట్టింది. శారీరకంగా దాడి చేయటంతో పాటు బెదిరింపులకు గురి చేసినట్లు తమ ఫిర్యాదులో పేరెంట్స్ తెలిపారు. దీంతో ఈ ఘటనను విద్యాశాఖ సీరియస్ గా తీసుకుంది. దాడి ఘటనలో నివేదిక వచ్చాక తప్పు చేసిన విద్యార్థులపై చర్య తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com