పేదలు, కార్మికుల ఆకలి తీర్చేందుకు ఫ్రీ బ్రెడ్ అందించనున్న అవ్కాఫ్ ఫౌండేషన్

- September 18, 2022 , by Maagulf
పేదలు, కార్మికుల ఆకలి తీర్చేందుకు ఫ్రీ బ్రెడ్ అందించనున్న అవ్కాఫ్ ఫౌండేషన్

దుబాయ్: నిరుపేద కుటుంబాలు, కార్మికులు ఆకలితో బాధపడొద్దన్న మంచి ఉద్దేశంతో వారికి ఫ్రీ గా బ్రెడ్ అందించేందుకు అవ్కాఫ్, మైనర్స్ అఫైర్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఫ్రీ గా బ్రెడ్ అందించే వెండింగ్ మెషీన్ లను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహ్మద్ బిన్ రషీద్ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎండోమెంట్ కన్సల్టెన్సీ (MBRGCEC) ద్వారా దుబాయ్ లోని పలు చోట్ల ఏర్పాటు చేసింది. బ్రెడ్ ఫర్ ఆల్ పేరుతో వీటిని ఏర్పాటు చేసింది. అవసరమైన వారికి తాజా బ్రెడ్ ను ఈ స్మార్ట్ మెషీన్ లు అందిస్తాయి. ముందుగానే డిజైన్ చేసిన ప్రొగ్రామ్ ద్వారా ఈ మెషీన్స్ తాజాగా వేడి, వేడి రొట్టెలను తయారు చేస్తాయి. కావాల్సిన వారు మెషీన్ లో బ్రెడ్ ఆప్షన్ ను క్లిక్ చేసి తీసుకోవచ్చు. కరోనా టైమ్ లో ఎవరూ ఆకలితో పడుకోవద్దని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రాజు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భావించి ఎన్నో కార్యక్రమాలు చేశారని అవ్కాఫ్, మైనర్స్ అఫైర్స్ ఫౌండేషన్ నిర్వాహకులు గుర్తు చేశారు. ఆయన  విజన్ నుంచే తమకు ఈ ఆలోచన వచ్చిందన్నారు.

విరాళాలు ఇవ్వొచ్చు

పేదల ఆకలి తీర్చే ఈ మంచి కార్యక్రమంలో ఎవరైనా భాగస్వాములు కావొచ్చని అవ్కాఫ్, మైనర్స్ అఫైర్స్ ఫౌండేషన్ తెలిపింది. ఇందుకోసం  విరాళాలు ఇవ్వాలని కోరింది. దుబాయ్ నౌ యాప్ ద్వారా విరాళాలు అందించవచ్చు. 10 దిర్హామ్ లు విరాళం ఇచ్చే వారు 3656, 3658 కు, 100 దిర్హామ్ లు ఇచ్చేవారు 3659, 500 దిర్హామ్ లు ఇచ్చే వారు 3679 కు SMS చేయవచ్చు.  వెబ్‌సైట్ ద్వారా కూడా విరాళాలు ఇవ్వవచ్చని పౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com