భారత్ కరోనా అప్డేట్
- September 18, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 5,664 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,555 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 47,922 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉన్నట్లు చెప్పింది.వారాంతపు పాజిటివిటీ రేటు 1.79 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.రికవరీ రేటు 98.71 శాతం ఉన్నట్లు తెలిపింది.
ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,39,57,929గా ఉన్నట్లు వివరించింది. ఇప్పటికే దేశంలో వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య మొత్తం 216.56 కోట్లు అని పేర్కొంది. వాటిలో రెండో డోసులు 94.65 కోట్లు, బూస్టర్ డోసులు 19.48 కోట్లు ఉన్నట్లు చెప్పింది. నిన్న 14,84,216 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 89.15 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. నిన్న 2,89,228 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







