షార్జా రాజుతో క్యాథలిక్ చర్చి బిషప్ సహా ఆయన బృందం సమావేశం

- September 18, 2022 , by Maagulf
షార్జా రాజుతో క్యాథలిక్ చర్చి బిషప్ సహా ఆయన బృందం సమావేశం

షార్జా: షార్జా రాజు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమిని క్యాథలిక్ చర్చి బిషప్ తో పాటు వారి బృందం కలిసింది. శనివారం అల్ బదీ ప్యాలెస్‌లో షార్జా రాజుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవలే క్యాథలిక్ చర్చి బిషప్ గా పాలో మారినెల్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కొత్త బిషప్ తో పాటు అంతకుముందున్న బిషప్ పాల్ హెండర్, చర్చికి సంబంధించిన అధికారులు షార్జా రాజును కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై షార్జా రాజు వారితో చర్చలు జరిపారు. ఇతర మతాలను గౌరవించటంతో పాటు పరమత సహనాన్ని ప్రతి ఒక్కరూ అలవార్చుకోవాల్సిన అవసరముందన్నారు. అదే విధంగా కొత్త బిషప్ తన విధులు నిర్వహించటంలో విజయం సాధించాలని రాజు ఆకాంక్షించారు. అటు షార్జా రాజు తమకు అందిస్తున్న సహకారం మరవలేనిదని ఆయనకు రుణపడి ఉంటామని క్యాథలిక్ చర్చి బిషప్ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com