ఖతార్ లో మరణించిన కార్మికునికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక సహాయం..

- September 18, 2022 , by Maagulf
ఖతార్ లో మరణించిన కార్మికునికి తెలంగాణ గల్ఫ్ సమితి  ఆర్థిక సహాయం..

దోహా: పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లిన కార్మికుడు అనుమానాస్పద పరిస్థుల్లో మరణించడం జరిగింది.వివరాల్లోకి వెళితే...జగిత్యాల జిల్లా ,కోరుట్ల మండలం, సంగెం గ్రామానికి చెందిన బోయినపల్లి భూమయ్య అనే కార్మికుడు గత నాలుగు సంవత్సరాల క్రితం ఖతార్ దేశానికి ఆజాద్ వీసా లో వెళ్ళాడు.రప్పించిన ఏజెంట్ పట్టించుకోక పోవడం తో  పనులు సరిగ్గ దొరుకోకపోవడం తో కల్లి వెల్లి అయ్యి కాలం ఏళ్లదిస్తున్న సమయంలో అనుమాన స్పద మృతి చెందడం అందరిని కలచి వేసింది, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలంగాణ గల్ఫ్ సమితికి చేరవేయగా గల్ఫ్ సమితి బృందం ఇండియన్ ఎంబసీ ,కంపనీ సహాయంతో చక చక పనులు చేయించి 15 రోజుల లోపు పార్ధివదేహాన్ని రప్పించడం జరిగింది.

ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో వారికి ఆర్తిక సహాయం చేయడానికి గల్ఫ్ సమితి  సభ్యలందరు తమవంతు సహాయంగా ఒక లాక్షా పది వేల (110,000) రూపాయలు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు ప్రేమ్ కుమార్ బొడ్డు, కింగ్ రాజు, మహమ్మద్ సుబాన్ గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుళ్లిళ్ల రవి గౌడ్, జేఏసీ నాయకులు మోహన్ రెడ్డి మరియు గ్రామ వార్డ్ మెంబర్లు  దేవయ్య.దొనే రాజు మారు బుమరెడ్డి గ్రామ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కార్మికుల బాధలను గుర్తించి గల్ఫ్ బోర్డు ప్రకటించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని గల్ఫ్ సమితి  తరఫున విజ్ఞప్తి  చేస్తున్నాము.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com