ఫ్యామిలీ వీసా జీతం పరిమితి KD800కి పెంపు..!

- September 18, 2022 , by Maagulf
ఫ్యామిలీ వీసా జీతం పరిమితి  KD800కి పెంపు..!

కువైట్: కుటుంబం/ఆధారిత వీసా (ఆర్టికల్ 22) కోసం దరఖాస్తు చేసుకోవడానికి జీతం పరిమితిని ప్రస్తుతమున్న KD 500  నుండి KD 800కి పెంచాలని అంతర్గత మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ మేర‌కు ఓ నివేదికను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. వీసా ఆర్టికల్ 17, 18 (ప్రైవేట్, ప్రభుత్వం) కలిగి ఉన్న ప్రవాసులందరికీ కుటుంబం/ఆధారిత వీసా కోసం దరఖాస్తు చేయడానికి కనీసం KD 800 ప్రాథమిక జీతం అవసరం. ఇత‌ర‌ అదనపు ఆదాయాన్ని వీసా జారీకి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. కువైట్‌లో జనాభాను నియంత్రించేందుకే కొత్త నియ‌మాన్ని రూపొందించాల‌ని మంత్రిత్వ శాఖ యోచిస్తోంద‌ని స‌మాచారం. ఈ నిర్ణయం ద్వారా అధిక ఆదాయం ఉన్న ప్రవాసులు మాత్రమే వారి కుటుంబాలను తీసుకురాగలరని, తద్వారా వారి భార్యలు స్థానిక మార్కెట్‌లో ఉద్యోగాల కోసం పోటీప‌డ‌ర‌ని మంత్రిత్వ శాఖ‌లోని ఓ ఉన్న‌తాధికారి తెలిపారు. ఆర్టికల్ 22 ప్రకారం ఇటీవల కువైట్‌లోకి ప్రవేశించిన వారందరినీ ఈ నిర్ణయం వ‌ర్తించ‌నుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com