ఒమన్ లో ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతిపై నిషేధం
- September 18, 2022
మస్కట్: ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతిని ఒమన్ నిషేధించింది. ఇకపై ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతి చేసుకునే వారిపై OMR1,000 పరిపాలనాపరమైన జరిమానా విధించబడుతుందిని హెచ్చరించింది. ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతిని నిషేధిస్తూ వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ మహమ్మద్ అల్ యూసఫ్ ఉత్తర్వులను(మంత్రివర్గ నిర్ణయం నం. 519/2022 ) జారీ చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. కంపెనీలు, సంస్థ, వ్యక్తులు ప్లాస్టిక్ బ్యాగులను దిగుమతి చేసుకోవడం నిషేధం. ఉత్తర్వుల నిబంధనలను ఉల్లంఘించే వారిపై OMR1,000 అడ్మినిస్ట్రేటివ్ జరిమానా విధించబడుతుంది. ఇదే ఉల్లంఘన పునరావృతమైతే జరిమానా రెట్టింపు అవుతుందని అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ బ్యాగుల నిషేధ చట్టం 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







