ఫ్యామిలీ వీసా జీతం పరిమితి KD800కి పెంపు..!
- September 18, 2022
కువైట్: కుటుంబం/ఆధారిత వీసా (ఆర్టికల్ 22) కోసం దరఖాస్తు చేసుకోవడానికి జీతం పరిమితిని ప్రస్తుతమున్న KD 500 నుండి KD 800కి పెంచాలని అంతర్గత మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఓ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీసా ఆర్టికల్ 17, 18 (ప్రైవేట్, ప్రభుత్వం) కలిగి ఉన్న ప్రవాసులందరికీ కుటుంబం/ఆధారిత వీసా కోసం దరఖాస్తు చేయడానికి కనీసం KD 800 ప్రాథమిక జీతం అవసరం. ఇతర అదనపు ఆదాయాన్ని వీసా జారీకి పరిగణనలోకి తీసుకోరు. కువైట్లో జనాభాను నియంత్రించేందుకే కొత్త నియమాన్ని రూపొందించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోందని సమాచారం. ఈ నిర్ణయం ద్వారా అధిక ఆదాయం ఉన్న ప్రవాసులు మాత్రమే వారి కుటుంబాలను తీసుకురాగలరని, తద్వారా వారి భార్యలు స్థానిక మార్కెట్లో ఉద్యోగాల కోసం పోటీపడరని మంత్రిత్వ శాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆర్టికల్ 22 ప్రకారం ఇటీవల కువైట్లోకి ప్రవేశించిన వారందరినీ ఈ నిర్ణయం వర్తించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







