బ్రిటన్ రాణి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్ చేరుకున్న దుబాయ్ రాజు
- September 19, 2022
లండన్ : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ లండన్ చేరుకున్నారు. ఆదివారం లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ -3తో సమావేశమై క్వీన్ ఎలిజబెత్ మరణానికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా యూఏఈ, యూకే మధ్య బలోపేతమైన సంబంధాల కోసం క్వీన్ ఎలిజిబెత్ చేసిన కృషిని కింగ్ చార్లెస్ తో పంచుకున్నారు. ఈ సమావేశంలో రాజుతో పాటు యూఏఈ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి రీమ్ అల్-హషిమీ కూడా పాల్గొన్నారు. అటు వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో సోమవారం క్వీన్ ఎలిజిబెత్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని ప్రపంచ దేశాల అధినేత లు వస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంది ప్రపంచ అధినేతలు ఒక్క చోట సమావేశం కావటం ఇదే మొదటిసారి కానుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!