ప్రొఫిషన్‌కీ, స్టడీస్‌కీ లింకు పెట్టిన బేబమ్మ.! చాలా తెలివైందే సుమీ.!

- September 19, 2022 , by Maagulf
ప్రొఫిషన్‌కీ, స్టడీస్‌కీ లింకు పెట్టిన బేబమ్మ.! చాలా తెలివైందే సుమీ.!

బేబమ్మగా ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. ఫస్ట్ సినిమాకే ఇండస్ర్టీని విశేషంగా ఆకర్షించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేస్‌లోకి స్పీడుగా దూసుకొచ్చిన ముద్దుగుమ్మల లిస్టులో బేబమ్మ కృతిశెట్టి పేరు కూడా మొదటి వరుసలో వుంటుందనాలి.
ఈ మధ్య రిలీజైన సినిమాల్లో హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో కనిపించింది కృతి శెట్టినే. వరుస సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయ్ ఆమె నుంచి. హిట్టా.? ఫట్టా.? అనే సంగతి పక్కన పెడితే, తన పాత్రలకు మాత్రం మంచి మార్కులు వేయించుకుంటూ పోతోంది కృతిశెట్టి. 
వెరీ లేటెస్టుగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో కృతి శెట్టి ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సినిమాకి మొదట టాక్ బాగోలేకపోయినా, ఓకే, కూల్ అండ్ కామ్‌గా సినిమా రన్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగానే కృతి శెట్టి తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.
సినిమా సినిమాకీ డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రలను ఎంచుకుంటున్నాననీ, అలా చేయడం వల్ల తనలోని నటి పరిణీతి చెందే అవకాశం వుంటుందనీ చెప్పింది కృతి శెట్టి. అంతేకాదు, పాత్ర చెప్పగానే, దానికి సంబంధించి చాలా హోమ్ వర్క్ చేస్తుందట. ఓ పక్క సినిమాల్లో కొనసాగుతూనే మరో వైపు సైకాలజీలో పట్టాకి కృషి చేస్తున్నాననీ కృతి శెట్టి చెప్పింది.
సైకాలజీనే ఎందుకు.? అంటే, సినిమాలో పాత్రలను అర్ధం చేసుకోవడానికి అది తనకు బాగా వుపయోగపడుతుందని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్, వావ్.! కృతి శెట్టి స్కెచ్ మామూలుది కాదుగా.! అని ఆశ్చర్యపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com