ట్రెండింగ్ టాక్: ‘ఆర్ఆర్ఆర్’కి ఆ గౌరవం దక్కాల్సిందే.!
- September 19, 2022
తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. జక్కన్న రాజమౌళి ప్రయోగాల్లో విజయం సాధించిన మరో శకటం ఈ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. ప్యాన్ ఇండియా వైజ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ కీర్తి గడించింది.
ఇటువంటి గొప్ప సినిమాకి ‘ఆస్కార్’ అవార్డు దక్కాల్సిందే అంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ నెట్టింట్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్‌లను ప్రపంచ వ్యాప్తగా ఓన్ చేసుకున్నారు అన్ని వర్గాల ఆడియన్స్. సో, ఉత్తమ హీరోలుగా ఆస్కార్ అవార్డ్ దక్కాల్సిందే ఈ ఇద్దరికీ అంటూ ఇరు హీరోల అభిమానులూ డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు, డైరెక్టర్ రాజమౌళితో పాటూ, సినిమాటోగ్రపీ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులు దక్కించుకోగల అర్హత వుంది.. అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అవును నిజమే, ఈ సినిమాకి ఖచ్చితంగా ఆ అర్హత వుంది. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి సినిమాలు రూపొందుతాయ్.
అలాంటప్పుడు అరుదైన గౌరవాలు కూడా ఇలాంటి సినిమాలకు దక్కితేనే, ఆయా సినిమాలకు ప్రోత్సాహకంగా వుంటుంది అనేది సినీ మేథావుల అభిప్రాయం.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం