గృహ కార్మికుల వార్షిక లెవీని పాక్షికంగా రద్దు చేసే యోచనలో సౌదీ ప్రభుత్వం

- September 20, 2022 , by Maagulf
గృహ కార్మికుల వార్షిక లెవీని పాక్షికంగా రద్దు చేసే యోచనలో సౌదీ ప్రభుత్వం

సౌదీ: సౌదీ లో ఉండే వ్యక్తులు తమ ఇళ్లలో పనిచేసేందుకు పెట్టుకునే కార్మికులకు సంబంధించి వార్షికంగా లెవీ చెల్లిస్తుంటారు. ప్రవాస యాజమానులైతే ఇద్దరికి మించి ఎక్కువ మంది పనివాళ్లను పెట్టుకుంటే వారిపై ఒక్కొక్కరికి ఏడాదికి 9, 600 ల రియాల లెవీ చెల్లిస్తారు. సౌదీ లో ఉండే యాజమానులకైతే నలుగురు కార్మికుల వరకు మినహాయింపు ఉంది. అంతకన్నా ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటే వారిపై ఏడాదికి లెవీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే 22 నుంచి మొదటి దశ లెవీని వసూలు చేస్తున్నారు. రెండో దశ ఉండే విధివిధానాలతో వచ్చే ఏడాది లెవీ వసూలు చేయనున్నారు. ఐతే సౌదీ పౌరులకు సెలక్టివ్ గా ఈ లెవీని కనీసం పాకిక్షంగానైనా రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ డిమాండ్ ను పరిశీలించేందుకు అంగీకరించింది. ఈ విధానం ఎలా ఉండాలన్న దానిపై శౌరా స్డడీ చేయాలని శౌరా కౌన్సిల్ కోరింది. సోమవారం కౌన్సిల్ సభ్యులతో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మిషాల్ అల్-సులామీ వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లెవీకి సంబంధించి స్టడీ చేయాలని ఆదేశించారు. ఇదే జరిగితే సౌదీలో ఉండే ఇంటి యాజమానులకు కాస్త రిలీఫ్ దక్కనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com