ఒమానీ స్టార్టప్ ‘ఎయిర్‌గో’కు అంతర్జాతీయ గుర్తింపు

- September 20, 2022 , by Maagulf
ఒమానీ స్టార్టప్ ‘ఎయిర్‌గో’కు అంతర్జాతీయ గుర్తింపు

మస్కట్: డ్రోన్ సేవలను అందించే ఒమానీ స్టార్టప్ ఎయిర్‌గో.. సెప్టెంబర్ 6 నుండి 8 వరకు యుఎస్‌లోని లాస్ వెగాస్‌లో జరిగిన కమర్షియల్ యూఏవీ ఎక్స్‌పోలో పాల్గొనడంతో అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది.  ఎక్స్‌పో అనేది వాణిజ్య మానవరహిత వైమానిక వాహనాలు, మానవరహిత విమాన వ్యవస్థల (UAS) కార్యకలాపాలు, ఏకీకరణపై దృష్టి సారించిన ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన. ఎయిర్‌గో.. తక్కువ ఎత్తులో డ్రోన్ కార్యకలాపాలను ప్రారంభించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా నుండి 200 కంపెనీలు, 75 నుండి 2,500 మంది డ్రోన్ నిపుణులు ఎక్స్‌పోలో పాల్గొన్నారని ఎయిర్‌గో సీఈఓ, వ్యవస్థాపకుడు అన్వార్ మొహమ్మద్ అల్ హినాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన AirGo పెవిలియన్ ను గణనీయమైన సంఖ్యలో సందర్శకులు సందర్శించినట్లు పేర్కొన్నారు. 2021 సెప్టెంబరులో సుల్తానేట్ సివిల్ ఏవియేషన్ అథారిటీతో తహ్లీక్ అనే మానవరహిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ప్రత్యక్ష పరీక్ష కోసం ఒప్పందంపై AirGo సంతకం చేసిందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com