సంక్షోభాల్లో ప్రపంచం కలిసికట్టుగా పనిచేయాలి - ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ

- September 21, 2022 , by Maagulf
సంక్షోభాల్లో ప్రపంచం కలిసికట్టుగా పనిచేయాలి - ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ

న్యూయార్క్ :  ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు, సంక్షోభ సమయాల్లో ప్రపంచంలోని అన్ని దేశాలు మరింత కలిసి కట్టుగా పనిచేయాలని ఖతార్ రాజు  షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ అన్నారు. న్యూయార్క్ లో జరిగిన  యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 77వ సెషన్ జనరల్ డిబేట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచం ఎదుర్కొంటోన్న చాలా సమస్యలను పరిష్కరించేందుకు  ఐక్యరాజ్య సమితి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతానికి ప్రపంచమంతా ఒక విలేజ్ గా మారిపోయిందన్నారు. ప్రతి సమస్య ఒక అంశంతో మరో అంశానికి ముడిపడి ఉందన్నారు. ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారి ఎంతో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం ఆ వేగం అంతగా లేదన్నారు. పర్యావరణ సమస్యలు, ఆర్థిక సంక్షోభాలు, సైనిక ఘర్షణల సమస్యలను పరిష్కరించే విషయంలో మరింత కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. వన్ వరల్డ్, వన్ హ్యుమానిటీ అనే విధానానికి అనుగుణంగా కృషి జరగటం లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం దురాక్రమణాలకు పాల్పడుతూ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. బలమైన ప్రపంచం కోసం మనమంతా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలను కోరారు. ఈ మీటింగ్ పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com