హఫర్ అల్-బాతిన్లో అల్లర్లకు పాల్పడిన 25 మందిని అరెస్ట్
- September 23, 2022సౌదీ అరేబియా: తూర్పు ప్రావిన్స్‌లోని హఫర్ అల్-బాటిన్ గవర్నరేట్ పరిధిలోని స్థానిక పార్క్ వద్ద కొంతమంది అల్లర్లకు పాల్పడ్డారు. అకారణంగా ట్రాఫిక్ కు ఇబ్బంది సృష్టించి వాహనాలను ధ్వంసం చేశారు. రోడ్డు వెళ్తున్న వారిని వేధించారు. దాదాపు 25 మంది గ్రూప్ ఒక్కసారిగా దాడులు చేస్తుండటంతో ప్రజలు హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 25 మంది బృంద సభ్యులను అరెస్ట్ చేశారు. ఉద్దేశ పూర్వకంగానే వారు అల్లర్లకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మొత్తం సంఘటనపై న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. వీరిపై ఆర్టికల్స్ 15, 17, 112 ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన నిందితులకు భారీగా జరిమానా విధించాలని కోర్టును ప్రాసిక్యూషన్ కోరింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ