‘సలార్’ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్.!
- September 24, 2022
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన శృతి హాసన్, మధ్యలో ప్రేమ, పెళ్లి అంటూ కెరీర్ అటకెక్కేసించుకున్న సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ పుణ్యమా అని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో శృతిహాసన్ క్రేజీ ఆఫర్లు కొట్టేస్తూ, పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
అందులో భాగంగానే ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ‘సలార్’ వుంది. ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి శృతిహాసన్ ఓకే చేయడం వెనుక కారణం ఏంటనేది తాజాగా చెప్పుకొచ్చింది శృతి హాసన్.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాంటి ప్రశాంత్ నీల్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం శృతి హాసన్ అదృష్టమే. కానీ, ఆ మాటను శృతిహాసన్ మరోలా వ్యక్త పరిచింది.
యాక్షన్ సినిమాలకు, ఎమోషనల్ టచ్ ఇచ్చి, ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయడంలో ప్రశాంత్ నీల్‌ది సెపరేట్ స్టైల్. ఆ స్టైలింగ్ నచ్చే, ఆయన సినిమాకి ఓకే చేశాను.. అంతేకానీ, ‘కేజీఎఫ్’ సూపర్ హిట్ అయ్యిందని కాదు.. అని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.
శృతిహాసన్ మాటలు అర్ధమయ్యీ అవ్వనున్నట్లుగా, ఒకింత వివాదాస్పదంగా వున్నాయంటూ చర్చ జరుగుతోంది. శృతి హాసన్ ఈ చర్చ సంగతి పక్కన పెడితే, ‘సలార్’లో కూడా ‘కేజీఎఫ్’లోని మదర్ సెంటిమెంట్ మాదిరి ఏదో స్పెషల్ సెంటిమెంట్ వుందంటూ శృతిహాసన్ ఇచ్చిన హింట్ ఫ్యాన్స్‌కి నచ్చేసిందండోయ్.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









