రెసిడెన్షియల్ ఏరియాల్లో తనిఖీలు నిర్వహించిన దుబాయ్ మున్సిపాలిటీ
- September 25, 2022
దుబాయ్: దుబాయ్ లోని రెసిడెన్షియల్ ఏరియాల్లో కొంతమంది చట్ట వ్యతిరేకంగా బ్యాచిలర్స్ కు రూమ్ లు అద్దెకు ఇస్తున్నారు. రెసిడెన్షియల్ ఏరియాల్లో బ్యాచిలర్స్ ఉండటం దుబాయ్ లో నిషేధం. ఐతే రూల్స్ ఉల్లంఘిస్తూ చాలా మంది బ్యాచిలర్స్ కు రూములు ఇస్తున్నారు. అది కూడా అసలు యాజమాలకు దగ్గర రెంట్ తీసుకొని సబ్ రెంట్ పేరుతో ఇస్తున్నారు. ఇలా అక్రమంగా భారీ సంపాదిస్తున్నారు. బ్యాచిలర్స్ సంఖ్య రెసిడెన్షియల్ ఏరియాల్లో పెరిగిపోవటంతో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో దుబాయ్ మున్సిపాలిటీ అధికారులు దీనిపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. హాస్టల్స్, రెసిడెన్షియల్ ఏరియాల్లో తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఉంటున్న వారిని, వారికి అద్దెకు ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ఏడాది లో 19,837 తనిఖీలు చేసి చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రెసిడెన్సీ చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి సంఖ్య భారీగా తగ్గింది. దుబాయ్ లో విల్లాలు, అపార్ట్ మెంట్లలో పరిమిత సంఖ్యలోనే నివాసితులు ఉండాలన్న రూల్ ఉంది. ఆ నిబంధనలు భారీగా ఉల్లంఘనలు జరుగుతుండటంతో స్థానికుల నుంచి భారీగా ఫిర్యాతులు వస్తున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులు తరుచూ తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా రెసిడెన్షియల్ చట్టాన్ని ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ నంబర్ 800900 కు ఫోన్ చేయాలని స్థానికులను అధికారులు కోరారు. రెసిడెన్సియల్ చట్టం అమలు విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని అధికారులు చెప్పారు. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు యూఏఈ లోని ఇలాంటి రూల్సే ఉన్నాయి. ఇటీవల అబుదాబి లో ఓ వ్యక్తి ఒక అపార్ట్ మెంట్ ను అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి యాజమాని అనుమతి లేకుండానే అతను చాలా మంది బ్యాచిలర్స్ కు సబ్ రెంట్ ఇచ్చాడు. దీంతో కోర్టు అతనికి 3 లక్షల దిర్హామ్స్ లు ఫైన్ వేసింది. ఈ విషయాన్ని కూడా దుబాయ్ మున్సిపల్ అధికారులు...రెసిడెన్షియల్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికి గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







