ఆసీస్ పై భారత్ ఘన విజయం...
- September 25, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ క్రికెట్ జట్టు అలవోకగా ఛేదించింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ 187 పరుగులు చేసింది.
2-1 తేడాతో టీం ఇండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది. భారత్ బ్యాటింగ్: సూర్యకుమార్ 69, కోహ్లీ 63 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 25(నాటౌట్), రోహిత్ శర్మ 14 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్: డేనియల్ శామ్స్ 2 వికెట్లు పడగొట్టారు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్: గ్రీన్ 52, టిమ్ డేవిడ్ 54 పరుగులు చేయగా, డేనియల్ సామ్స్ 28(నాటౌట్), జోష్ ఇంగ్లీస్ 24 పరుగులు చేశారు. భారత్ బౌలింగ్: అక్సర్ పటేల్ (3), భువనేశ్వర్, చాహల్, హర్షల్ పటేల్ ఒక్కోక్క వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









