హురా అలీ ప్రాంతంలో అగ్నిప్రమాదం. ముగ్గురికి గాయాలు
- September 26, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ లోని హురా అలీ రెసిడెన్షియల్ ఏరియాలోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయాలైన వారిని హాస్పిటల్ లో చేర్పించారు. అగ్ని ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే సివిల్ డిఫెన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. అటు ఒక్కసారిగా అపార్ట్ మెంట్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయని ఆ తర్వాత మంటలు కనిపించాయని స్థానికులు చెప్పారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









