వేసవి ముగిసేవరకు 45 రోజుల పాటు మజ్జిగ పంపిణీ
- April 18, 2016
: రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చర్చించింది. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల దాహం తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు.బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, జన సమ్మర్ద ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.దీనికోసం జిల్లాకు రూ.3కోట్లు చొప్పున కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వేసవి ముగిసేవరకు 45 రోజుల పాటు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించారు. నిరుపయోగంగా రక్షిత మంచినీటి పథకాల పునరుద్ధరణకు రూ.200 కోట్లు కేటాయించారు. వడగాడ్పుల మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించే అంశంపై మంత్రివర్గంలో చర్చించారు. దీనిపై ముఖ్యమంత్రి ఆర్థిక, న్యాయ శాఖల అధికారుల సలహాలను కోరారు.మంత్రివర్గం ఆమోదాలు * రాష్ట్రంలో 193 ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం * పీపుల్స్ హబ్ పేరిట ప్రజల వ్యక్తిగత సమాచారం కోసం ప్రత్యేక డేటా బ్యాంకు ఏర్పాటుకు ఆమోదం * పర్యాటక ప్రాజెక్టులకు 35 ఏళ్లు భూముల లీజుకు ఇచ్చే విధానానికి ఆమోదం
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







