ప్రారంభానికి సిద్ధంగా కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్

- September 26, 2022 , by Maagulf
ప్రారంభానికి సిద్ధంగా కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్

కువైట్: మిష్రెఫ్‌లోని కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్ ను వచ్చే నెలలో తిరిగి ప్రారంభించనున్నారు. సరికొత్త డిజైన్‌లు, ఆధునిక టెక్నాలజీతో ఫెయిర్ గ్రౌండ్ లోని ప్రధాన హాల్స్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు నిర్వహణ కంపెనీ తెలిపింది. ప్రధాన హాళ్లలో పెర్ఫ్యూమ్, వాచీలు, బుక్, బిల్డింగ్ మెటీరియల్, గోల్డ్ ఎగ్జిబిషన్‌లు వంటివి సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. కొవిడ్ లాక్ డౌన్ కారణంగా గత రెండేళ్లుగా మిష్రేఫ్ ఫెయిర్ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్‌లు నిలిపివేశారు. ఆ సమయంలో ఎగ్జిబిషన్ హాళ్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ కేంద్రాలుగా ఉపయోగించారు. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్‌కు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com