ఎండు మిరప కాయలలో గంజాయి పొట్లం
- April 18, 2016
హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 11 కిలోల గంజాయి అక్రమ మాదక ద్రవ్యాన్నిఅక్రమంగా తరలించే వ్యక్తి కస్టమ్స్ శాఖ సాధారణ అథారిటీకు అడ్డంగా దొరికిపోయాడు.కస్టమ్స్ శాఖ సాధారణ అథారిటీ ఇన్స్పెక్టర్ ఒక ఆసియా యాత్రికుడు దోహా రావడం గమనించి , ఆ వ్యక్తి తీసుకువెళుతున్న సామాను విషయంపై సందేహించాడు , అతని వెంట ఉన్న సంచుల విషయమై అనుబానం కల్గిన ఆ అధికారి ఆసియా యాత్రికుని సంచులలో పూర్తి శోధన చేయమని సిబ్బందికి ఆదేశించింది. ఈ వెతుకులాటలోఎండిన ఎర్ర మిరపకాయలలో స్థూలమైన ఒక గంజాయి పొట్లాన్ని రహస్యంగా లోపల పొరలలో 11 కిలోల గంజాయిని దాచి ఉంచినట్లు వారు కనుగొన్నారు. అనంతరం ఈ అక్రమ మందులను స్వాధీనం చేసుకొని ఈ సంచులను సీజ్ చేసిన భద్రతా అధికారులు అవసరమైన చట్టపరమైన చర్యలు ఆ యాత్రికునిపై తీసుకోవడానికి ఆదేశించారు. కస్టమ్స్ శాఖ సాధారణ అథారిటీ అధ్యక్షుడు అహ్మద్ బిన్ ఆలీ అల్- ముహాన్నది మాట్లాడుతూ స్మగ్లర్ గుర్తించడంపై ఇన్స్పెక్టర్ నిర్వహించిన విధి చురుకుదనంపై ప్రశంసించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







