ప్రపంచ పర్యాటక దినోత్సవం.. బహ్రెయిన్‌లో అనేక ఉచిత ఈవెంట్లు
- September 27, 2022
బహ్రెయిన్: 2022 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులు, జాతీయులు, నివాసితులకు అనేక ఉచిత కార్యక్రమాలను అందించనున్నట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) ప్రకటించింది. సౌక్ అల్ మనామాలో పర్యటనలు, పడవ ప్రయాణాలు, గుర్రపు స్వారీ, రాక్ క్లైంబింగ్, క్రాఫ్ట్స్ వర్క్‌షాప్‌లు, అనేక వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. అలాగే క్రీడలు, అడ్వెంచర్స్ నుండి కళలు, సంస్కృతి వరకు అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 27 నుండి ప్రైవేట్ బస్సులలో పర్యాటకులు, సందర్శకుల కోసం మనామా సౌక్, ది అవెన్యూస్ మాల్, సిటీ సెంటర్ బహ్రెయిన్, సీఫ్ మాల్, బహ్రెయిన్ ఫోర్ట్ వంటి పర్యాటక ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలలో అనేక కార్యక్రమాలను ప్రారంభించినట్లు BTEA తెలిపింది. సందర్శకులు, పర్యాటకులకు బస్సు బయలుదేరే ప్రదేశాల వద్ద ఉచిత వినోద టిక్కెట్‌లను అందించనున్నారు. వీటితో హోటల్‌లు, ఇతర పర్యాటక కార్యక్రమాలను ఉచితంగా ఎంజాయ్ చేయొచ్చని అథారిటీ వెల్లడించింది. పర్యాటక బస్సులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సేవలు అందించనున్నాయి.
తాజా వార్తలు
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్









