చందమామను వద్దు బాబోయ్ వద్దంటోన్న బన్నీ ఫ్యాన్స్.!
- September 28, 2022ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న ‘పుష్ప 2’ ఊరించి ఊరించి ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ అనీ, స్ర్కిప్ట్ వర్క్ అనీ.. అదనీ, ఇదనీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకే డైరెక్టర్ సుకుమార్ బోలెడంత టైమ్ తీసుకున్నారు.
ఎలాగైతేనేం, ఎట్టకేలకు సినిమా స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్లో బిజీగా వుంది ‘పుష్ప 2’ టీమ్. ఇదిలా వుంటే, ఈ సినిమాకి సంబంధించి ఓ కీలకమైన అప్డేట్ ఒకటి తాజాగా చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే, ఈ సినిమా కోసం చందమామ కాజల్ అగర్వాల్ రెండో సారి ‘స్పెషల్’ అవతారమెత్తబోతోందట. గతంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా కోసం తొలిసారిగా కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఒకింత నెగిటివిటీ మూట కట్టుకున్నా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఇంకోసారి కాజల్ స్పెషల్‌గా హాట్ స్టెప్పులేసేందుకు రెడీ అవుతోందట. ‘పుష్ప’లో సమంతతో ‘ఊ అంటారా ఊ ఊ అంటారా’ సాంగ్‌తో ఫ్యాన్స్‌కి స్పెషల్ కిక్కెక్కించిన సుకుమార్, ఈ సారి కాజల్‌తో ఆ స్పెషల్ కిక్కి స్కెచ్ రచించాడనీ తెలుస్తోంది.
అయితే, కాజల్ ఇటీవలే ఓ బిడ్డకి తల్లి అయిన సంగతి తెలిసిందే. సో, ఆంటీతో స్పెషల్ సాంగ్ చేయిస్తారా.? అంటూ బన్నీ ఫ్యాన్సే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అయితే, ఇప్పటికే ఈ డీల్ సెట్ అయిపోయిందనీ తెలుస్తోంది. చూడాలి మరి, నిజంగానే చందమామ స్పెషల్ సాంగ్ చేస్తుందో.? లేక ఇదంతా వట్టి గాలి మాటలేనో.!
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ