‘హైదరాబాద్ దర్శన్’ టూర్ ను తీసుకొచ్చిన TSRTC

- September 28, 2022 , by Maagulf
‘హైదరాబాద్ దర్శన్’ టూర్ ను తీసుకొచ్చిన TSRTC

హైదరాబాద్: TSRTC తాజాగా దసరా సెలవుల్లో భాగంగా ‘హైదరాబాద్ దర్శన్’ టూర్ ను తీసుకొచ్చింది. హైదరాబాద్ లో చూడదగ్గ ప్రదేశాలను ఈ టూర్ లో TSRTC చూపించబోతుంది. దసరా సెలవుల్లో సరదాగా.. ఒక రోజు మొత్తం ఉత్సాహంగా హైదరాబాద్ సిటీ మొత్తం చుట్టేద్దామనుకునే వాళ్లకు ఇది ఓ బంఫర్ ఆఫర్ అని చెప్పాలి. కేవలం 12 గంటల్లోనే హైదరాబాద్‌లోని పర్యటక ప్రాంతాల న్ని చూసేందుకు గాను ఈ ప్యాకేజీ ని తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. ఈ ప్యాకేజీ టికెట్ ధరలు.. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో పెద్దలకైతే రూ.250, పిల్లలకైతే రూ.130 గా ఉన్నాయి. మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో విహరించాలనుకునే వారికోసం.. పెద్దలకైతే రూ.450, పిల్లలకైతే రూ.340 గా నిర్ణయించింది. లాంఛ్ ఆఫర్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ కూడా టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఇది వీకెండ్ టూర్ ప్యాకేజీ మాత్రమేనని తెలిపింది.

ఇక ఈ టూర్ ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ దగ్గర ప్రారంభం కానుంది. టికెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులు టీఎస్‌ఆర్‌టీసీ టూరిస్ట్ బస్ ఎక్కాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు బిర్లామందిర్ చూడొచ్చు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చౌమహల్లా ప్యాలెస్ చూస్తారు. ఒంటి గంట నుంచి 1.45 గంటల వరకు తారామతి బారాదరి రిసార్ట్‌లోని హరిత హోటల్‌లో మధ్యాహ్న భోజనం ఉంటుంది. రెండింటి నుంచి మూడున్నర వరకు గోల్కొండ కోటలో పర్యటించొచ్చు. సాయంత్రం 4 నుంచి ఐదింటి వరకు దుర్గం చెరువును వీక్షించొచ్చు. ఐదున్నర నుంచి 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జిపై చక్కర్లు కొట్టొచ్చు. ఆరున్నర నుంచి ఐడున్నర వరకు ఎన్టీఆర్ పార్క్, హుస్సేన్‌సాగర్ సందర్శన ఉంటుంది. రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లోని ఆల్పా హోటల్‌కు తిరిగి చేరుకోవడంతో టూర్ పూర్తి అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com