ఈ సారి అక్కినేని హీరో కోసం ఆ హ్యాండ్సమ్ విలన్.!
- September 28, 2022అమ్మాయిల కలల రాకుమారుడు, ‘రోజా’, ‘ముంబయ్’ తదితర చిత్రాలతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న హ్యాండ్సమ్ అరవింద్ స్వామి. హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడీ నటుడు తమిళ నాట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో హ్యాండ్సమ్ విలన్గా కనిపించి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఆ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు అరవింద్ స్వామి. అయితే, ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. ఆఫర్లు వచ్చినా అరవింద్ స్వామి ఇంట్రెస్ట్ చూపించలేదట. తమిళంలో హీరోగా ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలతో బిజీ అయిపోయాడు అరవింద్ స్వామి.
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ అక్కినేని హీరో నాగ చైతన్య సినిమాతో అరవింద్ స్వామి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ భిన్నమైన చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం తొలిసారి ఖాకీ డ్రస్ వేసుకోబోతున్నాడు నాగచైతన్య. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో. మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో స్టైలిష్ విలన్గా మళ్లీ అరవింద్ స్వామిని సెలెక్ట్ చేశారనీ తెలుస్తోంది. ‘ధృవ’ సినిమా తరహాలోనే నెగిటివ్ షేడ్స్ వున్న ప్రాధాన్యత కలిగిన పాత్ర కావడంతో ఈ సినిమాకి ఓకే చేశారట అరవింద్ స్వామి. చూడాలి మరి, ఈ సినిమాతో మళ్లీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో అరవింద్ స్వామి.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం