కృష్ణంరాజు సంతాప సభ: 3 కోట్లు ఖర్చుతో భోజనాలు పెట్టించిన ప్రబాస్.!
- September 29, 2022
ఇటీవలే అనారోగ్యంతో సీనియర్ నటుడు కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆయనకు సంతాపంగా సొంతూరు మొగల్తూరులో అభిమానుల కోసం ప్రబాస్ భోజనాలు పెట్టిస్తున్నారు. ఇందులో విశేషమేముంది అంటారా.?
ప్రబాస్ ఫ్యామిలీ భోజనం అంటే ఖచ్చితంగా అది ప్రత్యేకమే. ఏకంగా లక్ష మంది అభిమానులు ఈ భోజనాలకు విచ్చేయనున్నారనీ అంచనా వేస్తున్నారు. ప్రబాస్‌తో పాటూ, ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఈ సంతాప కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇప్పటికే హైద్రాబాద్ నుంచి మొగల్తూరు చేరుకున్న ప్రబాస్ కుటుంబ సభ్యులు అక్కడి భోజన కార్యక్రమాల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. కృష్ణంరాజు బతికున్నంత కాలం ఆయన ఇంటికి వచ్చే అతిధులకు చేసే మర్యాదల గురించి ఇప్పటికే పలు కథనాల ద్వారా విన్నాం.
అదే లెగసీని తన పెదనాన్నపై వున్న అభిమానంతో తాను కంటిన్యూ చేస్తున్నాడు ప్రబాస్. అందులో భాగంగానే తాజా సంతాప సభ కార్యక్రమానికి విచ్చేస్తున్న అభిమానులకు ఏకంగా మూడు రకాల బిరియానీ, ఎనిమిది రకాల వెజ్ ఐటెమ్స్, పలు రకాల స్వీట్స్, రెండు రకాల రొయ్యల కూర, మూడు రకాల చేపల పులుసులు.. ఇలా మెనూలో ఏ ఒక్కటీ తగ్గకుండా, అంతకు మించి అనే రేంజులో ఏర్పాట్లు చేస్తున్నాడట ప్రబాస్.
అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ భోజన ఏర్పాట్లు వుండబోతున్నాయనీ తెలుస్తోంది. ఈ మొత్తం ఏర్పాట్లకు ఏకంగా 3 కోట్ల వరకూ ప్రబాస్ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం