‘గాడ్ ఫాదర్’: ఇది కదా మెగాస్టార్ చిరంజీవి అంటే.!
- September 29, 2022మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విజయ దశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనంతపురం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.
అయితే, తీరా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే సమయానికి జోరుగా వర్షం కురవడంతో, ఈవెంట్‌కి డిస్ట్రబ్ అవుతుందని భావించారంతా. కానీ, భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మెగాస్టార్ అభిమానులు ఎక్కడి వాళ్లు అక్కడే నిలబడిపోయారు.
అభిమానుల హుషారు చూసి, మెగాస్టార్ చిరంజీవి సైతం వర్షంలో తడుస్తూనే తన అమూల్యమైన స్పీచ్ ఇచ్చారు. దాదాపు అరగంట సేపు ఉరకలెత్తే ఉత్సాహంతో చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరున గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా చిరంజీవి.
ఇక, అభిమానులనుద్దేశించి చిరంజీవి మాట్లాడిన మాటలు నిజంగానే గూస్ బంప్స్ తెప్సిస్తాయ్. ఇది కదా చిరంజీవి అంటే.. అనిపిస్తుంది. ‘ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిరంజీవి ఈ స్థాయికి వచ్చాడని అనుకుంటారంతా. కానీ, నా వెనుక లక్షల మంది గాడ్ ఫాదర్స్ వున్నారు. నన్ను అభిమానించే ప్రతి ఒక్క అభిమానీ నాకు గాడ్ ఫాదరే.. నా మనసు అంతరాళాల్లోంచి వస్తున్న మాటలివి..’ అని గొంతెత్తి చెప్పారు చిరంజీవి.
ఆ మాటలకు చిరంజీవిపై వున్న అభిమానం వెయ్యి రెట్లు లక్షల రెట్లు, కాదు కాదు కోటి రెట్లు పెరిగిపోయిందని అభిమానులు మరోసారి తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ చిరంజీవి.!
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..