కింగ్ నాగార్జునతో ప్రవీణ్ సత్తారు సత్తా చూపిస్తాడా.?
- September 29, 2022
విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ, ప్రవీణ్ సత్తారు ఇంతవరకూ టాప్‌లో వున్న స్టార్స్‌ని పట్టలేకపోయాడు. అలాంటిది, ప్రవీణ్ టాలెంట్‌ని గుర్తించిన నాగార్జున ఆయనకు ఓ ఛాన్స్ ఇచ్చాడు. అదే ‘ది ఘోస్ట్’. నాగార్జున ఎంతో నమ్మకంతో ఈ ఛాన్స్ ఇచ్చాడు ప్రవీణ్‌కి. మరి ప్రవీణ్ ఆ నమ్మకం నిలబెట్టుకోగలడా.? ఏమో చూడాలి మరి.
సీనియర్ నటుడు రాజశేఖర్‌తో ‘పీఎస్వి గరుడవేగ’ సినిమా రూపొందించి, అస్సలు ఫేమ్‌లో లేని రాజశేఖర్‌కి సూపర్ డూపర్ హిట్ ఇచ్చా, మళ్లీ హీరోగా మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అది చాలదా.! ఆయన సత్తా ఏంటో తెలియడానికి.
ఇక, నాగార్జునను ‘ది ఘోస్ట్’ కోసం వింటేజ్ లుక్స్‌లోకి మార్చేశాడు. గతంలో నాగ్ చేసిన ‘శివ’, ‘అంతం’ తదితర సినిమాల్లో ఆయన ఆటిట్యూడ్, స్ట్రేచర్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు ప్రవీణ్ సత్తారు.
అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్లు, మాస్ అప్పీల్.. ఇలా ఏ ఒక్కటీ తగ్గకుండా ఈ సినిమాని రూపొందించాడు. అదే నమ్మకంతో, అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ వంటి పెద్ద సినిమా రిలీజ్ వున్నా కూడా ఈ సినిమాని ధైర్యంగా బరిలోకి దించేస్తున్నారు.
సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా నటిస్తోంది. అక్కినేని అభిమానులకి అసలు సిసలు దసరా పండగలా ‘ది ఘోస్ట్’ వుండబోతోందని ఈ సినిమాపై ఇంతవరకూ క్రియేట్ అయిన బజ్ బట్టి అర్ధం చేసుకోవచ్చు. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం