ఆదిపురుష్ నుండి ప్రభాస్ ‘శ్రీ రాముడి’ లుక్ విడుదల
- September 30, 2022
హైదరాబాద్: కృష్ణంరాజు మరణంతో శోకసంద్రంలో ఉన్న రెబెల్ అభిమానులకు కాస్త ఉపశమనం కల్పించారు ఆదిపురుష్ టీం.ప్రభాస్ తాలూకా శ్రీరాముడి లుక్ ను రిలీజ్ చేసారు. రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తం నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ఇక ఈరోజు శుక్రవారం ప్రభాస్ శ్రీరాముడి లుక్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు.
ఆకాశం వ్యపు విల్లు పెట్టి ఉన్న ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేసారు. ప్రభాస్ రాముడి ఆహార్యంలో ఒదిగిపోయాడు. పొడవాటి జుత్తు…చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా ఆకట్టుకున్నాడు. రాముడి ఆహార్యం కోసం వినియోగించిన కాస్ట్యూమ్స్..ఆనాటి అలంకరణ ప్రతీది గెటప్ ని మ్యాచ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులు సహా సో షల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడొచ్చాడు అంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేసి షేర్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్‌లో రోడ్ మూసివేత..!!
- దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!
- హజ్, ఉమ్రా కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఇటలీ, సౌదీ మధ్య జ్యుడిషియల్ సహకారం..!!