హైదరాబాద్ మెట్రోకు ‘జైపాల్ రెడ్డి’ పేరు పెట్టాలని రేవంత్ డిమాండ్...
- September 30, 2022
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోకు ‘జైపాల్ రెడ్డి’ పేరు పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.కేంద్ర మాజీమంత్రి, స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని రంగారెడ్డి జిల్లా, మాడ్గుల గ్రామంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, విశిష్ట అతిథి జస్టిస్ శుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు.హైదరాబాద్ మెట్రోకు.. జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మెట్రో నిర్మాణానికి జైపాల్ రెడ్డి కృషి చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం మెట్రో కోసమే కాదు.. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో జైపాల్ రెడ్డి కీలకపాత్ర పోశించారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల కష్టాల గురించి కేంద్ర కేబినెట్‌లో జైపాల్ రెడ్డి ప్రస్తావించేవారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరును మెట్రోకు పెట్టకపోతే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెట్రోకు జైపాల్ రెడ్డి పేరు పెడతామని స్పష్టం చేశారు. మాడ్గులలో ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డి విగ్రహాన్ని చూసి..రేవంత్ రెడ్డి కూతురు, భార్య మురిసిపోయారు.
ఇక ఏచూరి మాట్లాడుతూ..దేశంలో నాలుగు స్తంభాలపై చాలా దాడులు జరుగుతున్నాయని, వీటి నుంచి తట్టుకుని దేశాన్ని కాపాడుకోవాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.ఇందు కోసం మళ్లీ సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయాలు అవసరం అని చెప్పారు.కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి స్పూర్తితో ఆ దిశగా ముందుకెళ్లాలన్నారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకునేందుకు పునః సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి దశలో నేను, జైపాల్ రెడ్డి మొదటిసారిగా కలుసుకున్నామని తెలిపారు.జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా అన్నారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఇద్దరం కలిసి పనిచేశామని చెప్పారు. ఏ సిద్ధాంతాల ఆధారంగా జైపాల్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారో.. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయన్నారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







