ఎక్స్పో సిటీ దుబాయ్: సందర్శకులను ఆశ్చర్యపరిచేలా 'అవేకనింగ్ ఆఫ్ అల్ వాస్ల్' షో
- September 30, 2022దుబాయ్: ఎక్స్పో సిటీ దుబాయ్ లో భాగంగా సందర్శకులను ఆశ్చర్యపరిచేందుకు ఉచిత 'అవేకనింగ్ ఆఫ్ అల్ వాస్ల్' షో సిద్ధమైంది. ఎక్స్పో 2020 దుబాయ్ లో 'అవేకనింగ్ ఆఫ్ అల్ వాస్ల్' షో సాయంత్రం 6.15 గంటలకు (సాయంత్రం ప్రార్థన తర్వాత) ప్రారంభం కానుంది. 360-డిగ్రీల ప్రొజెక్షన్ సందర్శకులకు అద్భుతమైన విజువల్ థ్రిల్లింగ్ లో ముంచెత్తుతుందని అల్ వాస్ల్ షో నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత సృజనాత్మక ఆలోచనలతో రూపొందించిన విస్మయం కలిగించే సాంకేతికతలను షోలో భాగంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ షో సందర్భంగా సాంస్కృతిక, చారిత్రక అంశాలతోపాటు మానవీయ విలువలను కండ్లకు కట్టేలా ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. బుధవారం నుండి ఆదివారం వరకు వారంలో ఐదు సాయంత్రాలు 'అవేకనింగ్ ఆఫ్ అల్ వాస్ల్' షో ఉంటుందని, సందర్శకులందరికి ఉచిత ప్రవేశం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!