పౌరులు, నివాసితులకు ఉచితంగా ఫ్లూ వ్యాక్సిన్: సౌదీ
- September 30, 2022సౌదీ: పౌరులు, అధిక-ప్రమాద వర్గాల నివాసితులకు ఉచితంగా ఫ్లూ వ్యాక్సిన్లను అందజేయనన్నట్లు ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్ (EHS) ప్రకటించింది.ఈ మేరకు జాతీయ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఇన్‌ఫ్లుయెంజాతో సహా అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి EHS సమగ్ర ప్రణాళిక అమలులో భాగంగా ఫ్రీ వ్యాక్సిన్ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్‌లోని పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ షమ్సా లూటా తెలిపారు.యూఏఈ పౌరులు, గర్భిణీ స్త్రీలు, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, ఆరోగ్య రంగ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేయనున్నట్లు తెలిపారు. మిగతా వారు కనీస రుసుముతో వ్యాక్సిన్ ను పొందవచ్చన్నారు.అన్ని ప్రజారోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ క్లినిక్‌లు, EHS కింద ఉన్న ఆసుపత్రులలో ఈ సదుపాయం అందుబాటులో ఉందని డాక్టర్ షమ్సా లూటా తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు