అవును.! వాళ్లిద్దరూ కలిసిపోతున్నారా?

- October 01, 2022 , by Maagulf
అవును.! వాళ్లిద్దరూ కలిసిపోతున్నారా?

చెన్నై:సూపర్ స్టార్ రజనీకాంత్ ముద్దుల తనయ సౌందర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసింతే. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ, ‘ఔను మేమిద్దరం విడిపోతున్నాం..’ అంటూ ఈ జంట క్లారిటీ ఇచ్చేసిన సంగతి కూడా తెలిసిందే.
అయితే, విడాకుల కోసం ప్రకటన చేశారు కానీ, విడాకుల కోసం ఇంతవరకూ ఈ జంట అప్లై చేసింది లేదట. ఇరు కుటుంబాల పెద్దలూ వీరిద్దరి మధ్యా గొడవలు సద్దుమనిగేలా చేసి, ఇద్దరినీ కలిపేందుకు ట్రై చేస్తున్నారట. కుటుంబ సభ్యుల సలహా మేరకు, తమ ఇద్దరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఈ స్టార్ కపుల్ తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇకపై కలిసే వుండాలనీ, తమ మధ్య అభిప్రాయ బేధాలను సయోధ్యతో చక్కదిద్దుకోవాలనీ నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధం వీళ్లది. అంతటి సుదీర్ఘమైన అనుబంధాన్ని అనవరసరమైన అభిప్రాయ బేధాల కారణంగా రద్దు చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదనీ, ఏదైనా వుంటే, కూర్చొని చర్చించుకుని గొడవలు సద్దుమనిగేలా చేసుకోవాలని ఇటు రజనీకాంత్, అటు ధనుష్ తండ్రి కసూరి రాజా అర్ధమయ్యేలా చెప్పడంతో, ధనుష్, సౌందర్య మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ జంట విడాకుల ఆలోచనను విరమించి మళ్లీ కలిసిపోనున్నారనీ ప్రచారం జరుగుతోంది. విడాకుల ప్రచారం నిజమైనట్లే, ఈ కలిసిపోవడం అనే ప్రచారం కూడా నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com