అక్రమాస్తుల కేసులో డ్రాగ్ రేసింగ్ క్లబ్ ఛైర్మన్‌కి రెండేళ్ల జైలుశిక్ష
- October 01, 2022
బహ్రెయిన్: అక్రమాస్తుల కేసులో డ్రాగ్ రేసింగ్ క్లబ్ ఛైర్మన్‌కు లోయర్ క్రిమినల్ కోర్ట్ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే సంస్థ నుండి దుర్వినియోగమైన BD34,000 తిరిగి ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా పబ్లిక్ నిధుల దుర్వినియోగాన్ని పేర్కొంటూ నేషనల్ ఆడిట్ ఆఫీస్ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా క్లబ్ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నేషనల్ ఆడిట్ ఆఫీస్‌లోని ఆడిటర్‌లలో ఒకరిని క్లబ్ ఖాతాలను పరిశీలించడానికి కేటాయించడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్.. క్లబ్ ఛైర్మన్, కోశాధికారికి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్ డిప్యూటీ చైర్మన్, జనరల్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ అయిన హెచ్‌హెచ్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా క్లబ్‌ను రద్దు చేసి విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







