తండ్రి డబ్బు దొంగతనం చేసిన కొడుకుకు 6 నెలల జైలుశిక్ష
- October 01, 2022
బహ్రెయిన్: తండ్రి ఖాతా నుండి డబ్బు దొంగిలించిన 16 ఏళ్ల బహ్రెయిన్ కుర్రాడికి కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తల్లిదండ్రులు వేరుగా ఉన్న బాలుడు.. అతని తండ్రి ఖాతా నుండి BD11,000 కంటే ఎక్కువ దొంగిలించినట్లు అభియోగాలు మోపారు. రిఫార్మ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ నివేదిక ఆధారంగా అతని కేసును మూడు నెలల తర్వాత కోర్టు సమీక్షిస్తుంది. అయితే, ఈ నేరంలో బాలుడితో పాటు నిందితురాలిగా ఉన్న బాలుడి తల్లిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తన కొడుకు బెనిఫిట్‌పే ఖాతా నుండి డబ్బును బదిలీ చేశాడని తన కుమారుడి స్నేహితుడి నుండి కాల్ వచ్చిన తర్వాత ఫిర్యాదు చేశానని బాలుడి తండ్రి తెలిపారు. కొడుకు కస్టడీ, భరణం విషయంలో తనకు, తన మాజీ భార్యకు విభేదాలు ఉన్నాయని తండ్రి పోలీసులకు వివరించారు. ఇటీవల తన అబ్బాయి గేమ్స్ ఆడతానని తన ఫోన్ తీసుకున్నాడని, అప్పుడు తన బెనిఫిట్‌పే ద్వారా తన మాజీ భార్యతో సహా అనేక ఖాతాలకు నిధులను బదిలీ చేశాడని వివరించారు. అనంతరం తన ఖతాలో BD14,000 ఉండగా.. BD3,000 మాత్రమే మిగిలిందన్నారు. తమ విచారణలో బాలుడు ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!







