రియాద్ లో మొదటిసారిగా సౌదీ గేమ్స్. ఈ నెల 27 నుంచి ప్రారంభం

- October 02, 2022 , by Maagulf
రియాద్ లో మొదటిసారిగా సౌదీ గేమ్స్. ఈ నెల 27 నుంచి ప్రారంభం

రియాద్: అత్యంత వైభవంగా నిర్వహించనున్న సౌదీ గేమ్స్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ భారీ ఈవెంట్ కు తొలిసారి రియాద్ అతిథ్యమిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కింగ్ సల్మాన్ ఆధ్వర్యంలో జరిగే ఈ గేమ్స్ లో 6000 మంది మహిళ, పురుష అథ్లెట్స్ పాలొననున్నారు. కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గేమ్స్ నిర్వహిస్తారు. ఈ గేమ్స్ కు కింగ్ సల్మాన్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారని స్పోర్ట్స్ మినిస్టర్  అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్ తెలిపారు. వారికి దేశం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇక విజేతలకు భారీ మొత్తాన్ని నజరానాగా ఇవ్వనున్నారు. ఇందుకోసం సౌదీ ప్రభుత్వం 200 మిలియన్ రియాలను కేటాయించింది. బంగారు పతకం విజేతలకు మిలియన్, రజత పతక విజేతలు 3 00,000, కాంస్య విజేతలకు 1,00,000 రియాలు బహుమతి ఇవ్వనున్నారు. ఈ గేమ్స్ లో దేశం నలుమాలల నుంచి 200 కన్నా క్లబ్ లు పాల్గొననున్నాయి. ఐదు పారా-స్పోర్ట్స్ తో పాటు  45 వ్యక్తిగత , టీమ్ ఈవెంట్‌ లు సౌదీ గేమ్స్ లో ప్రేక్షకులను అలరించనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com