కువైట్.. వారంలో 1,842 యాక్సిడెంట్లు
- October 02, 2022
కువైట్: సెప్టెంబరు 24 నుండి 30 వరకు గడిచిన ఒక వారంలో కువైట్ రోడ్లపై 1,842 ప్రమాదాలు జరిగాయని ట్రాఫిక్ విభాగం తెలిపింది. దాదాపు 257 ప్రమాదాల్లో వ్యక్తులకు గాయాలు అవ్వగా.. మిగిలిన వాటిల్లో వస్తు నష్టాలు జరిగాయని పేర్కొన్నారు. గత వారం రోజుల్లో సుమారు 26,173 ఉల్లంఘనలను జారీ చేసినట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినందుకు 32 మంది యువకులను అదుపులోకి తీసుకోవడంతోపాటు 43 వాహనాలు, 79 సైకిళ్లను సీజ్ చేశామన్నారు. 44 ఘటనల్లో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని ట్రాఫిక్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించినట్లు వెల్లడించారు. వివిధ సందర్భాల్లో 18 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. పౌరులు, నివాసితులు అందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







