అక్టోబర్ 4న దుబాయ్లో హిందూ దేవాలయం ప్రారంభం...
- October 03, 2022
యూఏఈ: దుబాయ్లో కొత్త హిందూ దేవాలయం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆలయాన్ని అక్టోబర్ 4న ప్రారంభించనున్నారు.అయితే అక్టోబర్ 4వ తేదీన ఆలయం సందర్శనం కేవలం ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే అనీ,అక్టోబర్ 5వ తారీఖున ఆలయ ప్రవేశానికి రిజిస్ట్రేషన్/ఆహ్వానం అక్కర్లేదని ప్రజలు గమనించవలసిందిగా ఆలయ కమిటీ కోరింది.ఈ ఆలయంలో 16 మంది హిందూ దేవతలను ప్రతిష్టించారు.ఆలయంలో ప్రజలు వివాహాలు, ప్రైవేట్ ఈవెంట్లను నిర్వహించడానికి సౌకర్యాలు ఉన్నాయి.మరింత సమాచారం కోసం ఆలయ వెబ్సైట్ http://hindutempledubai.com ను సందర్శించాలని ఆలయ వర్గాలు తెలిపాయి. జబెల్ అలీ ప్రాంతంలో దుబాయ్ కారిడార్ ఆఫ్ టాలరెన్స్లో ఈ ఆలయం ఉంది.ఈ ప్రాంతంలో సిక్కు గురుద్వారాతోపాటు క్రిస్టియన్ వర్గాల కోసం అనేక చర్చిలు కూడా ఉన్నాయి.
హిందూ దేవాలయంలో ప్రత్యేకతలు
• ఆలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ, నాలెడ్జ్ సెంటర్లలో పెద్దసైజు LCD స్క్రీన్లను ఇన్స్టాల్ చేశారు.
• ఆలయ తలుపులు వాల్నట్తో తయారు చేశారు.
• దక్షిణ భారత దేవతలను నల్ల రాతి నుండి సేకరించారు.
• ఆలయంలో గణేశుడు, కృష్ణుడు, మహాలక్ష్మి, గురువాయూరప్పన్, అయ్యప్పన్ మొదలైన 15 ఇతర దేవతలతో పాటు శివుడు ప్రధాన దేవతలుగా పూజలు అందుకోనున్నారు.
• ఆలయం లోపల సిక్కుల పవిత్ర గ్రంథమైన శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
• ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించేందుకు ఎనిమిది మంది పూజారులను శాశ్వతంగా నియమించారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







