ప్రముఖ ఎన్ఐఆర్ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అట్లాస్ రామచంద్రన్ మృతి
- October 03, 2022
దుబాయ్: ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అయిన అట్లాస్ రామచంద్రన్ (80) చనిపోయారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో దుబాయ్ లోని ఆస్టర్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని రోజులుగా ఆయన ఆనారోగ్యంతో ఉన్నారు. ఛాతిలో నొప్పి రావడంతో శనివారం ఆయన హాస్పిటల్ లో చేరారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు తో మరణించారు. రామచంద్రాన్ దుబాయ్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరుగాంచారు. అంతేకాకుండా నిర్మాతగా పలు సినిమాలు తీశారు. 13 చిత్రాల్లో నటించారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. రామచంద్రన్ కు భార్య, కుమార్తె మంజు రామచంద్రన్ ఉన్నారు. ఇటీవలే తన 80 వ పుట్టిన రోజును బూర్జ్ ఖలీఫాలోని తన నివాసంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దశాబ్దాల క్రితమే భారత్ నుంచి యూఏఈ వచ్చిన ఆయన ఇక్కడే స్థిరపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







