ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టనున్న మస్కట్ మున్సిపాలిటీ
- October 03, 2022
మస్కట్: మస్కట్ లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఈ సమస్య మస్కట్ మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ తగ్గించేందుకు కొత్త ప్రాజెక్ట్ లు నిర్మించాలని నిర్ణయించారు. బ్రిడ్జిలు, టన్నెల్స్ తో పాటు మస్కట్ ఎక్స్ ప్రెస్ వే ని ఐదు లేన్ గా విస్తరిస్తామని ప్రాజెక్ట్ ల డైరెక్టరేట్ ఖలీఫా అల్ సియాబీ తెలిపారు. సాహ్వా టవర్ సమీపంలోని బ్రిడ్జి, టన్నెల్ కు సంబంధించిన డిజైన్ దాదాపు పూర్తైందన్నారు. అటు మస్కట్ ఎక్స్ ప్రెస్ హై వే ను మూడు నుంచి ఐదు లేన్ గా విస్తరించే పనులు వచ్చే ఏడాది ప్రాంరభిస్తామన్నారు. సిటీలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరించేందుకు దాదాపు 18 వీధులను విస్తరిస్తున్నామన్నారు. " 2023లో చాలా ప్రాజెక్ట్ ల పనులు ప్రారంభిస్తాం. 18 నుంచి 20 నెలల్లో వీటిని పూర్తిచేస్తాం " అని సియాబీ చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







