ఉమ్రా యాత్రికులకు గుడ్ న్యూస్...
- October 03, 2022
మక్కా: ఉమ్రా యాత్రికులకు సౌదీ అరేబియా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్రా యాత్ర కు వచ్చే అన్ని దేశాల పౌరుల వీసాలను మూడు నెలల పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక నెల మాత్రమే గడువు ఉండేది. దాన్ని మూడు నెలలకు పొడగిస్తున్నట్లు హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా తెలిపారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ ప్రకటన చేశారు. సౌదీ-ఉజ్బెకిస్తాన్ మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. అనంతరం ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ను సౌదీ మంత్రి అల్-రబియా కలిశారు. సౌదీ రాజు సల్మాన్, ప్రిన్స్, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్ ల విషెస్ ను ఉజ్బెకిస్తాన్ ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రాక సంబంధాలపై చర్చించారు. ఇక హజ్ యాత్రకు ఉజ్బెకిస్తాన్ నుంచి ఏటా భారీగా యాత్రికులు వస్తుంటారు. కరోనా తర్వాత దాదాపు 12 వేల మంది హజ్ యాత్రకు వచ్చారు. ఐతే ఉమ్రా యాత్రకు వచ్చే వారికి అన్ని మరిన్ని సేవలతో పాటు సులభంగా విజిట్, ఉమ్రా వీసాలు జారీ చేయటంపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య పలు రంగాల్లో మరింత సహకారం పెంపొందిచుకోవాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







