అబుధాబిలో ఘనంగా దాండియా సెలబ్రేషన్స్

- October 03, 2022 , by Maagulf
అబుధాబిలో ఘనంగా దాండియా సెలబ్రేషన్స్

యూఏఈ: కరోనా వ్యాప్తి తగ్గడంలో ప్రజలు దాదాపు మూడేళ్ల తర్వాత సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.యూఏఈ రాజధానిలోని వేలాది మంది భారతీయ కమ్యూనిటీ సభ్యులు కలిసి మాస్కులు ధరించకుండానే పండుగ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.సెప్టెంబర్ 28 నుండి స్థానిక అధికారులు కోవిడ్ -19 నిబంధనలను సడలించిన తరువాత 2019 నుండి మొదటిసారిగా నవరాత్రి, బతుకమ్మ వంటి పండుగలను కొవిడ్ ఆంక్షలు లేకుండా ఇండోర్ వాతావరణంలో జరుపుకున్నారు.ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) , భారత్ ఈవెంట్‌లు ఫుట్‌బాల్ క్లబ్‌లో నిర్వహించిన నవరాత్రి సంప్రదాయ జానపద నృత్యమైన 'దాండియా' సందర్భంగా 2,000 మందికి పైగా ప్రజలు హాజరై ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నట్లు ఐఎల్‌ఏ ప్రెసిడెంట్ అంబ్రీన్ షేక్,  ఐఎల్‌ఎ ప్రధాన కార్యదర్శి సలోని సరయోగి తెలిపారు. ఈ ఈవెంట్‌కు ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్స్ గ్రూప్, ఇండియన్ పీపుల్స్ ఫోరమ్, ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్, ఇతర కమ్యూనిటీ అసోసియేషన్‌లు మద్దతు ఇచ్చాయని భారత్ ఈవెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కెవి, వినోద కార్యదర్శి మోనా మాథుర్ వెల్లడించారు. అలాగే అబుధాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్‌లో దాదాపు 1,500 మంది తెలంగాణ రంగుల పూల పండుగ బతుకమ్మ వేడుకను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ, కౌన్సెలర్ డాక్టర్ బాలాజీ రామస్వామి,ఐఎస్‌సి అధ్యక్షుడు డి. నటరాజన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com