బాధితుల ఫిర్యాదు.. గృహ కార్మిక నియామక కార్యాలయాలపై చర్యలు
- October 04, 2022
కువైట్: గృహ కార్మిక నియామక కార్యాలయాల యజమానులు తక్కువ ధరకే ఫిలిప్పీన్స్ నుండి మహిళా గృహ కార్మికులను నియమిస్తామని చాలా మంది పౌరుల నుంచి రిక్రూట్ మెంట్ ఏజెన్సీలు భారీగా వసూళ్లకు పాల్పడి మోసం చేశారని, దీనిపై బాధితుల నుంచి వందలాది ఫిర్యాదులు వచ్చాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ తెలిపింది. విచారణ అనంతరం కొన్ని మెయిడ్ రిక్రూట్ మెంట్ కార్యాలయాలను మూసివేసి వారి లైసెన్స్‌ను రద్దు చేయడం జరిగిందన్నారు. కొన్ని గృహ కార్మిక కార్యాలయాలు గృహ కార్మికులను అందించడానికి తమ నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండటంలో విఫలమయ్యాయని.. దాంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అథారిటీ వెల్లడించింది. గతంలో ఫిర్యాదులపై నోటీసులు ఇచ్చినా ఏజెన్సీలు స్పందించలేదని, దాంతో వాటిని 3 నెలల పాటు మూసివేయాలని, వాటి లైసెన్స్ లను రద్దు చేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖకు రిఫర్ చేసినట్లు మ్యాన్ పవర్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







