మక్కాకు వెళుతుండగా ప్రమాదం.. 27 మంది యాత్రికులకు గాయాలు
- October 04, 2022
సౌదీ: పవిత్ర నగరమైన మక్కాకు వెళుతున్న యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 27 మంది యాత్రికులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రి తరలించినట్లు సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది. పశ్చిమ నగరం తైఫ్లో 50 మంది ప్రయాణికులతో బస్సు వెళుతుండగా ప్రమాదానికి గురైందని వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వైద్య సహాయం అందించాయన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 27 మందిని ఎనిమిది అంబులెన్స్ ల ద్వారా సమీపంలోని వైద్య సదుపాయాలకు తరలించినట్లు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, అయితే బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడిందని రెడ్ క్రెసెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







